రాష్ట్ర స్థాయి పోటీలకు దుబ్బాక విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు దుబ్బాక విద్యార్థులు

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

దుబ్బాకటౌన్‌: సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో దుబ్బాక సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ సుజాత తెలిపారు. సోమవారం పాఠశాలలో ఆమె మాట్లాడుతూ 9వ తరగతి విద్యార్థి బి.రుషి కుమార్‌ 200మీ. పరుగు, 600మీ. రిలేలో ప్రథమ స్థానం, మరో విద్యార్థి ఎన్‌.స్టీఫెన్‌ డిస్కస్‌ త్రోలో మూడవ స్థానంలో నిలిచారన్నారు. ఈ నెల 10న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, పీఈటీ మహేశ్‌ ను ఆమె అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement