పశు సంపదపై ఎల్‌నినో పడగ
పద ..
పేదెట్లా?
వాతావరణ పరిస్థితులతో పొంచి ఉన్న వ్యాధులు
తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం
పెరగనున్న ఎండు గడ్డి, దాణా ఖర్చులు
మూగజీవాల పై తీవ్ర ప్రభావం
ఇన్నాళ్లూ పశుపోషణతో ఉపాధి పొందుతున్న రైతులు ప్రస్తుతం వాటిని అమ్ముకునే పరిస్థితులు దాపురించాయి. వర్షాలు కురువకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో వరి ఎండుముఖం పట్టింది. యాసంగి సాగుపై అనిశ్చితి నెలకొనడంతో పశుపోషణ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఎండు గడ్డి లభించడం గగనంగా మారింది. గతంలో రూ. 100కు గడ్డి మోపు చొప్పున లభించిన ఎండుగడ్డి, నేడు రూ.175 పెట్టినా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. తక్కువ వర్షపాతం నమోదు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పశువుల ఆరోగ్యం, దాణా లభ్యత, పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశువుల్లో పోషకాహారలోపం తతెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పశువైద్యలు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ గడ్డి లభించని పక్షంలో పప్పుజాతి మేతలు, జొన్న, సజ్జ చొప్పను వాడాలని వారు సూచిస్తున్నారు. ఎండు గడ్డిపై యూరియా ద్రావణాన్ని చల్లి మాగబెడితే దాంతో పోషక విలువలు పెరుగుతాయని, పశుగ్రాసం తగ్గితే వాటిలో రోగ నిరోధకశక్తి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తే మేలు
● పశుపోషణ నిమిత్తం ప్రభుత్వం పశుగ్రాస విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేయాలి.
● అధిక దిగుబడిని ఇచ్చే శ్రేష్టమైన పశుగ్రాసం విత్తనాలను రైతులకు అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది.
● నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో శిఖం భూముల్లో ఉపాధి పథకం కింద పశుగ్రాసం పెంచాలి.
● పశువులు ఎండ వేడికి కాకుండా నీడలో ఉంచడానికి వీలుగా ఉపాధి నిధులతో షెడ్లు నిర్మించాలి.
● వేసవిలో పశువులు హీట్ స్ట్రెస్‌కు గురికాకుండా పశు వైద్యశాలల్లో ఎలక్ట్రోరల్ పొడులతో పాటు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాలి.
● పశువులకు తాగు నీటి లభ్యత కోసం ఉపాధి నిధులతో ప్రతి గ్రామంలో పశువుల తొట్లు నిర్మించాల్సి ఉంటుంది.
నేడు ధాన్యం, పత్తి కొనుగొలు కేంద్రాలు ప్రారంభం
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం, పత్తి కొనుగొలు కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగొళ్లు ప్రారంభం కానున్నాయి. వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.2,461, గ్రేడ్ బి రకం క్వింటాల్‌కు రూ.2,441 ధర నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే పత్తి క్వింటాల్‌కు అధిక ధర రూ.8,667, తక్కువ ధర రూ.8,267 ప్రభుత్వం ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎల్‌నినోతో పాడి రైతుకు ఆపద వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు పశుపోషణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎండు గడ్డితో పాటు దాణా ధరలు అమాంతం పెరగనున్నాయి. ఫలితంగా పోషకాహార లోపంతో పాటు ఎండ దెబ్బతో పశువులకు వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో పాటు చెరువులు ఎండిపోయే పరిస్థితుల్లో తాగునీరు దొరకడం కష్టతరంగా మారింది. – రామాయంపేట(మెదక్)/సాక్షి, సిద్దిపేట
జిల్లాలో ఇలా..


