ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

చేర్యాల(సిద్దిపేట): విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీజీయూఈఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి డిమాండ్‌ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌, ఆర్టిజన్‌ కార్మికులు తదితరులు యూనియన్‌లో చేరగా వారికి కండువాలు కప్పి సభ్యత్వం అందించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ...విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలు, రైతులపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదముందన్నారు. విద్యుత్‌ రంగాన్ని పరిరక్షించడంతోపాటు అందులో పనిచేసే కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. విద్యుత్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించి, 2026 పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి సుధాకర్‌, కాటం మధు, ఎన్‌పీడీసీఎల్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ అనిల్‌, జిల్లా అధ్యక్షుడు అశోక్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

టీజీయూఈఈయూ

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement