జాతీయ ఏక్తా వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఏక్తా వారోత్సవాలు ప్రారంభం

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

జాతీయ ఏక్తా దివస్‌ అభియాన్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జాతీయ ఏక్తా దివాస్‌ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయని ఈ నెల 31 వరకు వాటిని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయ ఏక్తా దివాస్‌ వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌లు, కరపత్రాలను అశోక్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వల్లభాయ్‌ పటేల్‌, మహాత్మా గాంధీ ఆశయానికి ఒక కార్యాచరణ విధానాన్ని రూపొందించారన్నారు. శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గుతున్న 544 సంస్థానాల ప్రజలను స్వతంత్ర భారత్‌లో విలీనం చేసి వారికి విముక్తిని ప్రసాదించడం పటేల్‌ జీవితానికి మణికిరీటంగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి 31 వరకు వివిధ జిల్లాల్లో వారం పాటు విద్యార్థులు, యువత, సీ్త్రలు, వయోవృద్ధులకు ఏక్తా అభియాన్‌ గురించి చర్చలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ముదిగొండ శ్రీనివాస్‌, డాక్టర్‌ సతీశ్‌, ప్రముఖ హోమియోపతి వైద్యులు దేవేందర్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement