బెజ్జంకి(సిద్దిపేట): ఐకమత్యంగా ఉంటేనే సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న యాదవ సంఘం మండల అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆదివారం మండలంలోని గుండారంలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించారు. అనంతరం రసమయి మాట్లాడుతూ...సభ్యుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, యాదవ సంఘం, బీఆర్‌ఎస్ నాయకులు, లక్ష్మణ్, తిరుపతి, రమేశ్, శ్రీకాంత్, రవి, తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: ఆప్యాయతకు దూరమై, ఆదరించే వారు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అనాథ వృద్ధులకు అండగా నిలవడమే బాల వికాస వాటర్ ప్లాంట్ ఫెడరేషన్ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి స్పష్టం చేశారు. పట్టణంలో బాల వికాస ఆధ్వర్యంలో ఆదివారం అనాథ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. సుమారు 40 మంది అనాథ వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుస్తులు, బియ్యం పంపిణీ చేయడంతోపాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ...మానవత్వమే నిజమైన సేవ అన్నారు. నిరాదరణకు గురైన వృద్ధులకు భరోసా కల్పించడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు వాల సుప్రజ, పిల్లి తిరుపతి, దాతలు రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సంధ్యావళి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
రాష్ట్ర కన్వీనర్ పోశెట్టి
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం కళాకారులకిచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పోశెట్టి డిమాండ్ చేశారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నవంబర్ 18న కరీంనగర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపడతామని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ పొశెట్టిని శాలువాతో సన్మానించారు. వీరి వెంట సుభాష్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్, సంతోశ్‌కుమార్, కరుణాకర్, మల్లారెడ్డి తదితరులున్నారు.
సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ రవి
సిద్దిపేటకమాన్: దాబాల్లో మద్యం సిట్టింగ్‌లకు, మద్యం విక్రయించడానికి, తాగడానికి అనుమతులు లేవని సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ రవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ ప్రాంతంలోని దాబాల వద్ద సిబ్బందితో కలసి పోస్టర్లు వేశారు. సిద్దిపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లోని దాబాల్లో ఎకై ్సజ్ సీఐ రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మౌనిక సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..దాబాల్లో కస్టమర్లకి మద్యం సేవించడానికి అనుమతిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి మద్యం సిట్టింగ్‌లు ఏర్పాటు చేసే దాబా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


