గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

సిద్దిపేటరూరల్‌: మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సహనం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే జాతిపితకు అందించే నిజమైన నివాళి అని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్లో గాంధీ చిత్రపటానికి డీఆర్వో నాగరాజమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ అనుసరించిన అహింసామార్గం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అధికారులు, సిబ్బంది గాంధీజీ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి రఫిక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీఆర్వో నాగరాజమ్మ

కలెక్టరేట్‌లో గాంధీ జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement