సౌర విద్యుత్‌తో బిల్లుకు ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌తో బిల్లుకు ఉపశమనం

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

సౌర విద్యుత్‌తో బిల్లుకు ఉపశమనం గాంధీ అడుగుజాడల్లో నడవాలి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి

విద్యుత్‌ శాఖ డీఈ కృష్ణయ్య

హుస్నాబాద్‌: గృహ వినియోగదారులు ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ బిల్లుకు ఉపశమనం లభిస్తుందని విద్యుత్‌ శాఖ డీఈ ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. హుస్నాబాద్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయ ఆవరణలో సేవా సేతు అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సోలార్‌ విద్యుత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ కృష్ణయ్య మాట్లాడుతూ..ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

దరిపల్లి చంద్రం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జాతిపిత గాంఽధీ అడుగు జాడల్లో నేటి యువత నడవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం ఉద్యోగ ఆశావహులకు సూచించారు. గాంధీ 157వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ...గాంధీ అనుసరించిన శాంతి, అహింస, సత్యం, నిజాయితీ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం, నైతిక విలువలను పెంపొందించవచ్చని చెప్పారు.

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌సీ సంతోశ్‌ పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 5వరకు వేములవాడలో జరుగనున్న 36వ సబ్‌జూనియర్‌ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శుక్రవారం బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...క్రీడాకారులు తమలోని ప్రతిభను చాటి కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement