పకడ్బందీగా పరిశీలన
పింఛన్లు ఇవ్వాలి
ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా దసరా నుంచి చేయూత పథకం కింద పింఛన్లు అందిచేందుకు కసరత్తులు చేస్తుండటంతో ఈ సారైనా తమకు పింఛన్లు వస్తాయన్న గంపెడాశతో దరఖాస్తులు చేసుకున్నారు. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. చాలామంది పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ దరఖాస్తులు పట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
జిల్లాలో 14,777 మంది దరఖాస్తులు
చేయూత పింఛన్ల కోసం ఆగష్టు 9 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో జిల్లాలో 14,777 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అధికంగా 8,107 మంది వితంతువులు,దివ్యాంగులు 2,659, గీత కార్మికులు 1,717, ఒంటరి మహిళలు 1,041,చేనేత కార్మికులు 953, బోదకాలు బాధితులు 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో వివిధ రకాల పింఛన్లు లబ్ధిదారులు 1,81,915 ఉండగా వీరికి నెలనెలా రూ.39,34,,54,640 ప్రభుత్వం అందజేస్తుంది.
జిల్లాలో 6,149 పింఛన్ల తొలగింపు
● గత జూన్, జూలైలో పెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా జిల్లాలో మృతులు, అనర్హుల జాబితాలో ఉన్న 6,149 మంది పింఛన్లను అధికారులు తొలగించారు.
పూర్తయిన పరిశీలన
చేయూత పెన్షన్ల కోసం లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన సెప్టెంబర్ 30తో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నియమించిన 226 మంది అధికారుల బృందాలు దరఖాస్తు దారుల వద్దకు నేరుగా వెళ్లి పరిశీలించాయి. 14 ప్రశ్నలతో కూడిన వివరాలను సరిచూసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. చేయూత యాప్‌లో అర్హుడా కాదా అన్న విషయాన్ని టిక్ చేసి లోకేషన్ ఫొటోతో సహా అప్‌లోడ్ చేశారు. కాగా, జిల్లాలో కొత్తగా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పరిశీలన తర్వాత ఎంతమందికి వస్తాయోనన్న విషయం ఇంకా అధికారులు వెల్లడించేందుకు మరింత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. మొదటి దశ మాత్రమే పూర్తయిందని ఇంకా రెండు విడతల్లో వడపోసిన తర్వాతనే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతుండటంపై చాలామంది లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
పింఛన్ల కోసం అభాగ్యుల ఎదురుచూపులు
ఈ ఫొటోలో ఉన్నది దుబ్బాకకు చెందిన చేనేత కార్మికురాలు శ్రీరాం పద్మ. కులవృత్తిపైనే ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న పేద కుటుంబం ఈమెది. ప్రతిరోజు చేనేత సహకార సంఘంలో దారం కండెలు చుడుతూ వచ్చిన కూలిడబ్బులతో అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకుంటోంది. చేనేత కార్మికుల కోటాలో తన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలాంటి పరిస్థితి పద్మ ఒక్కరికే కాదు చాలామంది అభాగ్యులు తమకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. – దుబ్బాక
పూర్తైన దరఖాస్తుల పరిశీలన
జిల్లాలో పింఛన్ల కోసం అప్లై చేసుకున్న 14,777 మంది
చేయూత దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం ఒక దశ పూర్తయింది. మరో రెండు దశల పరిశీలన తర్వాతనే అర్హుల జాబితా ప్రకటిస్తాం. దీనిపై అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది.
– జయదేవ్ ఆర్య,డీఆర్‌డీఓ పీడీ
చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలి. చేనేత కార్మికులు కడు దర్భుర పరిస్థితుల్లో కాలం గడుపుతుండ్రు. ప్రభుత్వం నేతన్నలకు ఈసారి తప్పకుండా అవకాశం కల్పించాలి.
– సూరం ప్రభాకర్, దుబ్బాక


