రేవంత్‌ది అసమర్థ పాలన | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ది అసమర్థ పాలన

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

దుబ్బాకటౌన్‌: రైతుల సాగుకు 24 గంటల విద్యుత్‌ సరఫరా మాట దేవుడెరుగు..కనీసం 12 గంటల కరెంటు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌దని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల ఆస్తులపై పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దౌల్తాబాద్‌ మండలంలోని గాజులపల్లి, గోవిందాపూర్‌, మల్లేశంపల్లి, దౌల్తాబాద్‌ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. గాజులపల్లిలో సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. గాజులపల్లి, దౌల్తాబాద్‌, గోవిందాపూర్‌, మల్లేశంపల్లి గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.

పర్మినెంట్‌ ఏఈని కేటాయించండి

దౌల్తాబాద్‌లోని విద్యుత్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాన్ని ఎంపీ సందర్శించారు. రికార్డులను పరిశీలించి సబ్‌ ఇంజనీర్‌తో వ్యవసాయానికి అందుతున్న విద్యుత్‌ సరఫరా వేళల వివరాలపై ఆరా తీశారు. సరఫరా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దౌల్తాబాద్‌ మండలానికి పర్మినెంట్‌ విద్యుత్‌ ఏఈని నియమించి, విద్యుత్‌ సిబ్బందిని పెంచాలని జిల్లా అధికారులను కోరారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు మండలంలోని ప్రతీ గ్రామంలో రూ.30 లక్షలతో మినీ గోదాములు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్ని గ్రామాల సర్పంచ్‌లకు భరోసా కల్పించారు. మల్లేశంపల్లిలో మాజీ జెడ్పీటీసీ ధార సత్యనారాయణ, వివిధ పార్టీలకు చెందిన వార్డు మెంబర్లు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.

పార్టీలకు అతీతంగా సర్పంచులు పనిచేయాలి

ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement