నాచగిరి హుండీ ఆదాయం రూ.16.7లక్షలు | - | Sakshi
Sakshi News home page

నాచగిరి హుండీ ఆదాయం రూ.16.7లక్షలు

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

నాచగిరి హుండీ ఆదాయం రూ.16.7లక్షలు జయవిజయులకు నగల ధగధగ నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్‌ 26 నుంచి ‘ప్రజా కళాజాతర’

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించారు. 84 రోజులలో వివిధ హుండీల ద్వారా ఆలయానికి రూ.16,71,537 ఆదాయం సమకూరింది. హుండీ లెక్కింపును దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ గురుభద్రమ్మ, ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షించారు. భ్రమరాంబిక సేవాసమితి, శివకేశవ సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు.

బంగారువర్ణంలో నాచగిరి మిలమిల

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి శ్రీవారి గర్భాలయ ప్రాంగణం బంగారు తాపడం చేసిన నగధగలతో మెరిసిపోతోంది. హైదరాబాద్‌కు చెందిన యాసారం సంజీవచారి–రుక్మిణి దంపతులు గర్భగుడి ద్వారపాలకులైన జయవిజయులకు బంగారు తాపడం(కోటింగ్‌)తో తయారుచేయించిన కవచాలు, ఆభరణాలను బుధవారం ఆలయానికి బహూకరించారు. అదేరోజు వాటిని జయవిజయులకు అలంకరించారు. దీంతో బంగారు మిలమిలతో మెరిసిపోతున్న జయవిజయులు, గర్భద్వార ప్రాంగణం భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నది.

సిద్దిపేటకమాన్‌: గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌, సీఐ రవి తెలిపారు. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఈ నెల 24న సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసి ఉంటాయని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గజ్వేల్‌: అరుణోదయ విమలక్క 50ఏళ్ల పాటల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈనెల 26 నుంచి 28వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ప్రజా కళా జాతర’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు రాంచంద్రం, సత్యనారాయణ, రాజులు, మల్లికార్జున్‌, కృష్ణ, సత్తయ్య, ఎల్లయ్య, చిన్ని కృష్ణ, నర్సింహ కోరారు. బుధవారం గజ్వేల్‌లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 52ఏళ్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో విమలక్క ప్రస్థానం గొప్పదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాకళా జాతర’లో ఈనెల 26నుంచి 28వరకు 50పాటలు, 50 ప్రదర్శనలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement