ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్‌ కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్‌ కీలకపాత్ర

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

జిల్లా వైద్యాధికారి ధనరాజ్‌

ఘనంగా ఆయుర్వేద దినోత్సవం

సిద్దిపేటజోన్‌: వైద్య విధానాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్‌ది ముఖ్యమైన పాత్ర ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ధనరాజ్‌ అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక స్వచ్ఛ బడిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఆయుష్‌ వైద్య విధానాలు, చికిత్స పద్ధతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెరుగైన ఫలితాల కోసం అవసరమైన సందర్భంలో ఆయుష్‌ వైద్య సేవలు పొందాలని సూచించారు.. ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరా ఝాన్సీ మాట్లాడుతూ.... ఆయుష్‌ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యులు వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, ఆయుష్‌ ఆసుపత్రి ఇంచార్జ్‌ సూపరింటెండెంట్‌ ఉమాదేవి, వైద్యులు గౌతమి ప్రియ, కేదారి,సంపత్‌ కుమార్‌, అజీజ్‌, మాజీ కౌన్సిలర్‌ దీప్తి, మెడికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement