ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

కలెక్టర్‌ హైమావతి

ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై కలెక్టర్‌ సమీక్ష

సిద్దిపేటరూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లు, గృహనిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన లబ్ధిదారుల వివరాలను పూర్తి చేసి ఆ పత్రాలను కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. ఆయా మండలాల వారీగా ప్రణాళిక ప్రకారం గెజిటెడ్‌ ఆఫీస్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని, అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను ప్రోత్సహించి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పథకం ప్రతి లబ్ధిదారునికి సహాయం అఽందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి భగవంత్‌ రావు, డీఈ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement