ఐశ్వర్యప్రదం.. వరలక్ష్మీ వ్రతం | - | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యప్రదం.. వరలక్ష్మీ వ్రతం

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో శ్రావణ శోభ సంతరించుకుంది. పలు ప్రాంతాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీదేవి, రేణుకా ఎల్లమ్మ, మహమ్మాయి అమ్మ వార్ల ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు. దీంతో జిల్లా అంతటాపండుగ వాతావరణం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. – ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement