22ఏ జీఓతో పేదల భూముల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

22ఏ జీఓతో పేదల భూముల దోపిడీ

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

సిద్దిపేటరూరల్‌: పేదల భూములు దోచుకునేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం 22ఏ జీఓ తెచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ అన్నారు. శుక్రవారం జీఓ 22ఏ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బైరి శంకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు దోచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పేరుతో పేదలను దోచుకుంటోందన్నారు. కార్యక్రమంలో తుంగ కనకయ్య, విభీషణ్‌రెడ్డి, వెంకటేశం, రాంగోపాల్‌రెడ్డి, భిక్షపతి, రజనీకర్‌రెడ్డి, ఉమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement