న్యూస్‌రీల్
ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు పదవులను దక్కించుకునేందుకు పలువురి మధ్య పోటీ
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గ్రామ అధ్యక్షుడు, మండల కమిటీల నియామకానికి కసరత్తు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నాలుగు నియోజకవర్గ కేంద్రాలుండటంతో ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండటం, మిగతా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటంతో పార్టీని పటిష్టపరిచేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేవలం కార్యాలయాలకే పరిమితమయ్యారని ఆరోపణలున్నాయి. పలు నియోజకవర్గాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి..పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారికి ప్రాధాన్యతనివ్వనున్నారు.
జిల్లాలోని 26 మండలాలకు గాను 21 మండలాలకు అధ్యక్షులను నియమించగా, ఇంకా ఐదు మండలాలకు అధ్యక్షులను నియమించాలి. ఈ నెల 5వ తేదీ నాటికి మండల కమిటీలను నియమించనున్నారు. ప్రతీ మండలంలో ఉపాధ్యక్షులను మహిళలనే నియమించాలని ప్రణాళికను రూపొందించారు. ఈ కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీన గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గం మండల అధ్యక్షులు నియామకం ఇంకా పెండిగ్‌లోనే ఉంది.
మహిళలకు అవకాశం
మండల కమిటీలో ఉపాధ్యక్షులుగా మహిళలకు అవకాశం కల్పిస్తాం. ఇప్పటికే దుబ్బాక, గజ్వేల్, జనగామ నియో జకవర్గంలోని మండలా ల్లో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. మండల అధ్యక్షులకు త్వరలో మూడు రోజుల పాటు శిక్షణనిస్తాం. మండల కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తాం. త్వరలో సిద్దిపేట నియోజకవర్గంలోని మండలాలకు సైతం అధ్యక్షులను నియమిస్తాం.
– తూంకుంట ఆంక్షారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు
పదవులు దక్కించుకునేందుకు పోటీ
పార్టీ పదవులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిబంధనలు విధించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకుల ప్రయత్నాలు ప్రారంభించారు. సుదీర్ఘ విరామం అనంతరం ఆయా పదవులలో నియామకాలు జరుపుతుండటంతో.. పార్టీ అధికారంలో ఉండటంతో నేతలు వాటిని దక్కించుకొనేందుకు పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జీలను కలిసి కమిటీలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అందులో
భాగంగా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, పట్టణ కమిటీలను నియమించేందుకు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లా కమిటీ, పలు మండలాలకు అధ్యక్షులను
నియమించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్యకార్యకర్తలు, నేతలతో సన్నాహక సమావేశాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నిర్వహిస్తున్నారు.


