భవిష్యత్‌కు ‘పది’ పునాది
● మంచి మార్కులు సాధిస్తే ఐ–ప్యాడ్ గిఫ్ట్ ● మాజీ మంత్రి హరీశ్‌రావు ● ఇందిరానగర్ పాఠశాలలో ‘విజయీభవ’ కార్యక్రమం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్‌ను మార్చేది పదో తరగతి అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. టెన్త్ విద్యార్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మీ స్థితిని, గతిని మార్చేది పదో తరగతి ఫలితాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలంటే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. మంచి చేతిరాత ఉంటే మార్కులు అధికంగా సాధించే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు ఐప్యాడ్‌ను గిఫ్ట్‌గా అందిస్తామన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంటున్నామని, పది ఫలితాల్లో మనం ఫస్ట్ రావాలన్నదే నా తపన అన్నారు. ఈ ఏడాది పది ఫలితాలలో సిద్దిపేటకి మొదటి స్థానం తెచ్చి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నా సొంత ఖర్చులతో పదోతరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేశానన్నారు. పరీక్షల సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్‌లు వాడకుండా, జాగ్రత్తగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పదవులు శాశ్వతం కాదు
చిన్నకోడూరు(సిద్దిపేట): సంపాదన, పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులు సేవా శాశ్వతంగా నిలుస్తుందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అల్లీపూర్‌లో మాజీ సర్పంచ్ అనసూయ ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆమె జ్ఞాపకార్థం వారి కుమారులు గ్రామానికి వైకుంఠరథం, శవ పేటికను హరీశ్‌రావు సమక్షంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ అనసూయ గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. అల్లీపూర్ గ్రామం అన్నింటా అభివృద్ధి చెందిదంన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్‌కు ‘పది’ పునాది
భవిష్యత్‌కు ‘పది’ పునాది


