సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 2 2026 8:46 AM | Updated on Mar 2 2026 8:46 AM

సోమవా

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

త్వరలో 50 గదులు,

క్యూకాంప్లెక్స్‌ ప్రారంభిస్తాం

మంత్రి పొన్నం ప్రభాకర్‌

మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకని ప్రత్యే క పూజలు నిర్వహించారు. అంతకుముందు ఈఓ కృష్ణప్రసాద్‌, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రణాళిక బద్దంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమేకాకుండా.. అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీలు దేశ భవిష్యత్తుకు మూలమైన విద్యపై విమర్శలు చేయడం సరికాదన్నారు. విద్యా కమిషన్‌ ఇచ్చిన నివేదికలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శించడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని విద్య కమిషన్‌ ఇచ్చిన నివేదికను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రె స్‌ మండల అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్‌, ఆలయ చైర్మన్‌ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ సోమవారం: 6.28

సహర్‌ మంగళవారం: 5.11

ఈఓగా కృష్ణ ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

మల్లన్న ఆల య నూతన ఈఓగా కృష్ణ ప్రసాద్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత ఈఓ వెంకటేశ్‌ పదవీ విరమణ పొందడంతో దేవాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కృష్ణ ప్రసాద్‌ను ఈఓగా ఇక్కడికి బదిలీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతానన్నారు.

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20261
1/3

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20262
2/3

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20263
3/3

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement