ఏకగ్రీవమైతే నిధుల వరదే | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవమైతే నిధుల వరదే

Mar 2 2026 8:46 AM | Updated on Mar 2 2026 8:46 AM

ఏకగ్రీవమైతే నిధుల వరదే

ఏకగ్రీవమైతే నిధుల వరదే

● కేంద్రమంత్రి బండి సంజయ్‌ ● గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల ఎంపీ నిధులు

● కేంద్రమంత్రి బండి సంజయ్‌ ● గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల ఎంపీ నిధులు

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకుంటే నిధుల వరద పారుతుందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సృష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కోహెడ మండలం విజయ్‌నగర్‌ కాలనీలో బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న కాతం అమ్యూలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం ప్రకటించిన రూ.10లక్షల ఎంపీ నిధుల పత్రాన్ని గ్రామస్తుల సమక్షంలో పాలకవర్గానికి అందజేశారు. అలాగే అదనంగా సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.15లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం రూ.25లక్షల నిధులతో విజయ్‌నగర్‌ కాలనీ అభివృద్ధి పనులు మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ కోహెడ మండలంలో రూ.40కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి మోజార్టీ స్థానాలు కట్టబెట్టిన ప్రజల ఆశీర్వాదంతోనే నేడు అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ సర్పంచ్‌లు గెలిచిన గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఖమ్మం వెంకటేశం, జాలిగం రమేష్‌, సర్పంచ్‌ మ్యాకాల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement