
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
తొగుట(దుబ్బాక): భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని చందాపూర్‌లోకి వరద నీరు చేరడంతో పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి కలెక్టర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కూడవెల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహం ఉన్నచోట రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు. వరద కారణంగా చందాపూర్ రేషన్ దుకాణంలో తడిసిపోయిన బియ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. తడిసిన బియ్యం తీసుకుని మంచి బియ్యం అందించాలని తహసీల్దార్‌కు ఆదేశించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్