
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు
కోడికూత కూయగానే పొలం బాట పట్టే రైతన్న.. ఇప్పుడు యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం సైతం జిల్లాలో పలు చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు.పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. సిద్దిపేట రూరల్, దుబ్బాక, గజ్వేల్, మిరుదొడ్డి, హుస్నాబాద్ మండలాల్లో ప్రధాన రహదారులపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సకాలంలో ఎరువులుసరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రోజంతా నిరీక్షించినా రెండు బస్తాలు కూడా లభించడంలేదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలే నేడు రైతులపై చిన్నచూపు చూస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలతో రహదారులపై రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు.
– సిద్దిపేటరూరల్/దుబ్బాకటౌన్/గజ్వేల్‌రూరల్/హుస్నాబాద్/మిరుదొడ్డి(దుబ్బాక)

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న