
జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్
హుస్నాబాద్‌రూరల్: జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్ (న్యాక్) భవనం నిర్మించేందుకు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని సర్వే నంబర్ 265లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామీణ భవన నిర్మాణ రంగ కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి న్యాక్ భవనం ఉపయోగపడుతుందన్నారు. భూమిని న్యాక్ అధికారులకు అప్పగిస్తే భవన నిర్మాణ శంకుస్థాపనకు సిద్ధం చేస్తారన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు చూపిన స్థలంలో ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. హుస్నాబాద్‌కు 150 పడకల అస్పత్రి మంజూరు అయిందని, దీనిని పాత ఆస్పత్రి భవనాలను కూల్చి అదే స్థలంలో నిర్మించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఎల్లమ్మ చెరువు పర్యటక పనులను పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.