
పాక్‌వి కవ్వింపు చర్యలు
విజయం మనదే..
● పొన్నం ప్రభాకర్
● మంత్రికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
హుస్నాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాతాప పడకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి జన్మదిన సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు. పలు శాఖల అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ భారత ప్రభుత్వం సరైన విధంగా స్పందించి జరిపిన దాడులకు, ఆ పాత్ర పోషించిన త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ చర్యలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఎవరైనా సున్నితమైన అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసులకు చెప్పాలని సూచించారు. సైనికులు ఉండే కంటోన్మెంట్ ఏరియాలకు అండగా ఉంటూ సహకరించాలని కోరారు.
ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం మనదే.. ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించవద్దని.. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని, భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని గురువారం చిన్నకోడూరులోని శేరుపల్లి ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు పలు ఆలయాల్లో పూజలు చేశారు. హనుమాన్ మాలధారులు, యువత పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. – చిన్నకోడూరు(సిద్దిపేట)

పాక్‌వి కవ్వింపు చర్యలు