‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Apr 20 2025 7:54 AM | Updated on Apr 20 2025 7:54 AM

‘విశ్

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విశ్వవాసు తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్‌ను మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో దేవాదాయశాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ సంధ్యారాణి శనివారం ఆవిష్కరించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగులు, అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈఓ విశ్వనాఽథ్‌శర్మ, బుగ్గ రాజేశ్వరిస్వామి ఆలయ ఈఓ శ్రీధర్‌రెడ్డి, చైర్మన్‌ అమరేశ్‌ విష్ణు, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, చంద్రకుమార్‌, రాంరెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ రక్షణ

అందరి బాధ్యత

గజ్వేల్‌రూరల్‌: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ సుజాత, దేవదాసు అన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు శంషాబాద్‌ పరిధిలోని కర్తల్‌లో శనివారం జరిగిన ‘యూత్‌ లీడర్స్‌ కాన్ల్కెవ్‌ ఫర్‌ బెటర్‌ ఎర్త్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు పోస్టర్‌ ప్రెజంటేషన్‌ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై వివరించారు. ప్రొఫెసర్లు పురుషోత్తంరెడ్డి, బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. జంతు జాలాన్ని రక్షించుకోవాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే భారీనష్టం

దుబ్బాకటౌన్‌: అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పదని అగ్నిమాపకశాఖ అధికారి కమలాకర్‌ హెచ్చరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం సినిమా థియేటర్‌లో ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కంచారు. లీడింగ్‌ ఫైర్‌ అధికారి లక్ష్మణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్‌కు దారేది?

హుస్నాబాద్‌: మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లేదారి లేకుండా అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం డిమాండ్‌ చేశారు. కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన మున్సిపల్‌ భవనం వద్ద అధికారులు బ్యారి కేడ్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీని వల్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను ఎండలోనే పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, నవీన్‌, జగ్జీవన్‌, వికాస్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

హరీశ్‌రావు పరామర్శ

సిద్దిపేటరూరల్‌: మండలంలోని చింతమడక గ్రామంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త వాతపు సత్యనారాయణ భార్య రామలక్ష్మి ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ వర్మ తదితరులు ఉన్నారు.

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ 
1
1/4

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ 
2
2/4

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ 
3
3/4

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ 
4
4/4

‘విశ్వావసు’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement