
కొండపోచమ్మ సన్నిధిలో దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం కుటుంబ సమేతంగా కొండపోచమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీ నేతలు జిలేబితో దత్తాత్రేయను తులాభారం వేశారు. – జగదేవ్‌పూర్(గజ్వేల్)
స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న దత్తాత్రేయ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం పెద్ద పట్నం వేసిమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ఎంపీ రఘనంధన్‌రావు తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్ మనుచౌదరి, పోలీస్‌కమిషనర్ అనురాధ, ఆర్డీఓ చంద్రకళ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలుకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ధర్మం కోసం పనిచేయండి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): హిందూ ధర్మం కోసం పార్టీలకతీతంగా పనిచేయాలని, విద్యార్థులు విద్యనే లక్ష్యంగా ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం మండలంలోని తిగుల్‌నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ సిబ్బంది, అర్చకులు శాలువాలు కప్పి ప్రసాదం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటు పాడాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
జిలేబితో తులాభారం..
కొండపోచమ్మ ఆలయం వద్ద బండారు దత్తాత్రేయను బీజేపీ నేతలు జిలేబితో తులాభారం వేశారు. జిలేబి ఓ వైపు పెట్టి తూకం వేయగా 65 కేజీల బరువు తూగారు. అలాగే గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజును గవర్నర్ శాలువా కప్పి సన్మానించారు.
ఫంక్షన్‌హాల్ ఏర్పాటుకు కృషి..
కొండపోచమ్మ ఆలయం వద్ద ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తామని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యకార్థం ఫంక్షన్‌హాల్ నిర్మించాలని మాజీ సర్పంచ్ రజిత వినతిపత్రం అందించగా ఎంపీ స్పందించారు.
04జీజేడబ్ల్యూ73ఏః బండారు దత్తాత్రేయను జిలేబితో తులాభారం వేస్తున్న నాయకులు