జిల్లాలో సన్‌ఫ్లవర్‌ కొనుగోలు కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో సన్‌ఫ్లవర్‌ కొనుగోలు కేంద్రాలు

Mar 4 2025 7:11 AM | Updated on Mar 4 2025 7:10 AM

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలో సన్‌ ఫ్లవర్‌ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులకు ఉపయోగపడనుంది. బహిరంగ మార్కెట్లలో ప్రయివేటు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పత్తి మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం కేంద్రాన్ని అందుబాటులోకి తేవడంతో రైతులకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.7,280 లభించనుంది.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం సన్‌ ఫ్లవర్‌ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అన్నారు. పత్తి మార్కెట్‌ యార్డులో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా11,193 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగు అయినట్లు పేర్కొన్నారు. దిగుబడి అంచనా మేరకు జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్‌, బెజ్జంకి, గజ్వేల్‌, తొగుట, చిన్నకోడూరు, అక్కన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ జరగనుందని, రైతులు నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని సూచించారు. నూనె గింజలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని, దళారులకు అమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో మార్క్‌ ఫెడ్‌ డీఎం క్రాంతి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు, జిల్లా సహకార శాఖ అధికారి నాగమణి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. మాజీమంత్రి హరీశ్‌రావు సన్‌ఫ్లవర్‌ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ రాసిన విషయం విదితమే.

సిద్దిపేట మార్కెట్‌లో ప్రారంభం

రైతులు సద్వినియోగం చేసుకోవాలి:

అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement