ఎంపీ విజయాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

ఎంపీ విజయాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలి

Published Tue, Apr 16 2024 6:45 AM

మాట్లాడుతున్న ప్రశాంత్‌ - Sakshi

ఎన్‌ఎస్‌యూఐ నేత ప్రశాంత్‌

కొండపాక(గజ్వేల్‌): మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు గెలుపును కాంగ్రెస్‌ పార్టీకి గిప్టుగా ఇచ్చేలా ఎన్‌ఎస్‌యూఐ కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్‌ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రవీంద్రనగర్‌లో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూఐ బలోపేతం కోసం కాంగ్రెస్‌ సహకరించడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బల్‌మూర్‌ వెంకట్‌కు ఎంఎల్‌సీ పదవిని ఇచ్చిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల మండల ఇన్‌చార్జిలుగా రవి, భానును నియమించినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement