
సిద్దిపేటలో నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి రమేశ్ బాబు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో డబుల్ సెంచరీ నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఆర్‌ఓ కేంద్రాల్లో స్వీకరించారు. అధికారులు సోమవారం స్క్రూటినీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాలుగు నియోజకవర్గాల్లో 224 మంది నామినేషన్లు ఆమోదం పొందగా, 24 తిరుస్కరణకు గురయ్యాయి. సిద్దిపేటలో 39 మంది దాఖలు చేయగా ఇద్దరివి రిజక్ట్ చేశారు. 37 వాటికి అమోదం తెలిపారు. హుస్నాబాద్‌లో 36 మంది వేశారు. ఇద్దరివి తిరస్కరణకాగా 34 ఓకే అయ్యాయి. దుబ్బాకలో 22 మంది పోటీ చేసేందుకు నామినేషన్లు వేయగా ఏడుగురు తిరస్కరణకు గురికాగా 15 అమోదం పొందాయి. గజ్వేల్‌లో 127 మంది దాఖలు చేశారు. వాటిలో 13 తిరస్కరించగా 114 మంది నామినేషన్లు ఓకే అయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అప్పుడు బరిలో ఎవరెవరు ఉంటారో తేలనుంది.
పరిశీలన తరువాత తేలిన లెక్క
నాలుగు నియోజకవర్గాల్లో పత్రాల పరిశీలన పూర్తి
రేపటి వరకు ఉపసంహరణకు గడువు
Comments
Please login to add a commentAdd a comment