
ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని అందిస్తున్న మాచాపూర్ గ్రామస్తులు
సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల తీర్మానం
సిద్దిపేటరూరల్: ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల ప్రజలు సిద్దిపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమానికి సుడా చైర్మన్ హాజరై మాట్లాడారు. అన్నివేళలా అందుబాటులో ఉండే మంత్రి హరీశ్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీహరిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, బీఅర్‌ఎస్ మండల అధ్యక్షుడు యాదయ్య, సర్పంచ్‌లు ఎల్లవ్వ, భాగ్యలక్ష్మి బాలయ్య, ఎంపీటీసీ చంద్రం, నాయకులు బాలకిషన్‌రావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.