బీఆర్‌ఎస్‌ లీడర్‌, గాయకుడు కాన్గల్‌ శ్రీనివాస్‌గౌడ్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ లీడర్‌, గాయకుడు కాన్గల్‌ శ్రీనివాస్‌గౌడ్‌ మృతి

Apr 20 2023 4:54 AM | Updated on Apr 20 2023 9:11 AM

- - Sakshi

శ్రీనివాస్‌గౌడ్‌ (ఫైల్‌)

సిద్దిపేటఅర్బన్‌/తొగుట: బైక్‌పై నుంచి పడి బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి చెందాడు. సిద్దిపేట అర్బన్‌ మండలం కిష్టసాగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. తొగుట మండలం కాన్గల్‌ గ్రామానికి చెందిన మరు పల్లి శ్రీనివాస్‌ గౌడ్‌(43) మూడు రోజుల క్రితం బండిపై నుంచి పడడంతో తలకు తీవ్రగా యాల య్యాయి. కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఆస్ప త్రి నుంచి డిస్‌చార్జి అయిన తర్వాత పొన్నా లలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా కిష్టసాగర్‌ రోడ్డులో స్పృహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాన్గల్‌లో విషాదం
ఉద్యమపాటలతో తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన గాయకుడు కాన్గల్‌ శ్రీనివాస్‌గౌడ్‌ మృతితో విషాదం అలుముకుంది. కాన్గల్‌ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ టీడీపీలో క్రీయాశీల కార్యకర్తగా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మీటింగ్‌ను అడ్డుకొని వార్తల్లోకెక్కారు. వార్డు మెంబర్‌గా, విద్యా కమిటీ చైర్మన్‌గా, ఏఎంసీ డైరెక్టర్‌గా, పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా.. శ్రీనివాస్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement