మహిళా రక్షణ చట్టాలను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 11:30 AM | Updated on Feb 26 2023 6:39 AM

మాట్లాడుతున్న మహేందర్‌   - Sakshi

మాట్లాడుతున్న మహేందర్‌

సిద్దిపేటకమాన్‌: మహిళా రక్షణ చట్టాలను గౌరవించడంతో పాటు ఇతరులు కూడా గౌరవించేలా కృషి చేయాలని అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌ సూచించారు. జండర్‌ సెన్సిటైజేషన్‌, రిసెప్షన్‌ విధులపై సీపీ కార్యాలయంలో రిసెప్షన్‌, వర్టికల్‌ సిబ్బందికి శుక్రవారం వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జండర్‌ తేడా లేకుండా ముందుకు వెళ్తే సమాజ శ్రేయస్సు, దేశ అభివృద్ధి ఉన్నతంగా ఉంటుందన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో స్నేహిత, సఖి, భరోసా సెంటర్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు గృహహింసకు, బయట వేధింపులకు గురైతే వెంటనే స్నేహితకు సమాచారం అందించి కౌన్సెలింగ్‌ ద్వారా కుటుంబాలు నిలబెట్టవచ్చని తెలిపారు. స్వార్డ్‌ సంస్థ సీఈఓ శివకుమారి మాట్లాడుతూ మన ద్వారా సమాజంలో మార్పు రావాలని దానికి అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రిసెప్షన్‌, వర్టికల్‌ ఇంచార్జి తొగుట సీఐ కమలాకర్‌, సిసిఆర్బి సీఐ గురుస్వామి, మహిళ పోలీసు స్టేషన్‌ సీఐ దుర్గ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement