ఉత్తమ సేవలపై జిల్లా అధికారుల
పలు సూచనలు
జహీరాబాద్: జహీరాబాద్, కోహీర్ మండలాల్లో ఉన్న 108 వాహనాలను క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ నరేశ్‌యాదవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మెడికల్ స్టాక్, వాటి పనితీరుతోపాటు రికార్డులను పరిశీలించారు. డ్యూటీలో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కేసు రాగానే 30 నిమిషాలలో వాహనం స్టార్ట్ చేసుకుని వెళ్లి రోగికి తగిన వైద్యం అందిస్తూ దగ్గర్లో ఉన్నటువంటి ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. మండల ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో హుస్సేన్, 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, పైలెట్లు శ్రీనివాస్, హమీద్, 102 సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అధికారులకు సూచించారు. జహీరాబాద్‌లో డివిజన్‌స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యుత్‌ను అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజల వైపు నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన ముందుజాగ్రతలు తీసుకోవాలన్నారు. అధికారులు విద్యుత్ సమస్యలను పరిష్కరించే విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లోనే
వరికి మద్దతు ధర
సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డ్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకారపరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కనీస మద్దతు ధర్వ క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రూ.2,461, సాధారణ రకం రూ.2,440 బోనస్ రూ.500 కలిపి మొత్తం క్వింటాల్‌కు రూ.2,961 ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా పరిశుభ్రపరిచి ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిచంద్రప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ పబ్బతి రత్నాకర్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వై.ప్రభు, మండలపార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, సర్పంచులు మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.
హుస్నాబాద్: ఢిల్లీ సాహి త్య సదస్సుకు హాజరుకావాలని హుస్నాబాద్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, జన జాగృతి వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న జాతీయ సదస్సుకు సంపత్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొనేందుకు అంతర్జాతీయ అద్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రత్యేక ఆహ్వానం అందించారు.


