పొగ మంచు.. తస్మాత్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

పొగ మంచు.. తస్మాత్‌ జాగ్రత్త

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

● మృత్యువాత పడుతున్న వాహనదారులు ● రోజురోజుకీ పెరుగుతున్న చలి తీవ్రత ● ఉదయం 8:00 దాటినా తగ్గని పొగమంచు

● మృత్యువాత పడుతున్న వాహనదారులు ● రోజురోజుకీ పెరుగుతున్న చలి తీవ్రత ● ఉదయం 8:00 దాటినా తగ్గని పొగమంచు

సంగారెడ్డి జోన్‌: శీతాకాలం కావడంతో కొన్ని రోజులుగా ఉదయం 8 గంటలు దాటినా పొగ మంచు తీవ్రత తగ్గటం లేదు. చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వేకువజామున ప్రయాణించే వాహనదారులు పొగమంచుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇటీవల న్యాల్‌కల్‌ మండల పరిధిలోని న్యామతాబాద్‌ చౌరస్తాలో పొగమంచు కారణంతో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడటమే ఇందుకు నిదర్శనం.

తప్పని ప్రయాణం..

వివిధ పరిశ్రమల్లో పనిచేసే వారు, కూలీలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు, వర్తక, వ్యాపారస్తులకు ప్రయాణాలు తప్పడం లేదు. వాహనాలపై వెళ్లే క్రమంలో పొగమంచు కారణంతో లైట్లు వేసుకుంటున్నారు. దగ్గరకు వచ్చేంతవరకు ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించటం లేదు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాలు రోడ్డు పక్కన నిలిపి ఉంచుతున్నారు. ఒక్కసారిగా వాహనాలు కనిపించడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల న్యాల్‌కల్‌ మండల పరిధిలోని న్యామతాబాద్‌ చౌరస్తాలో పొగ మంచు కారణంతో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగి స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు.

పోలీసు అధికారుల సూచనలు

చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వీలైనంత వరకు పొగమంచు సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సూచించారు. పరిమిత వేగంతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించుకోవచ్చని చెప్పారు. వాహ నాలు నడిపేటప్పుడు వాహనాల హెడ్‌లైట్లు, ఇండికేటర్లు వినియోగించాలని, పొగమంచు సమయంలో లో–బీమ్‌ లైట్లు ఉపయోగించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement