ప్రారంభం కాని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వానాకాలం దాదాపు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కాగా ఎల్‌నినో ప్రభావంతో వానలు లేక దిగుబడులు ఆశించిన మేర రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మార్కెట్‌లో ధాన్యం ధరలు పెరగడంతో రైతుల వద్ద తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్నాలకు రూ.4వేల పైచిలుకు ధర ఉండగా, వ్యాపారులు రూ.3వేల నుంచి రూ.3,400 ధర పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2461 ఉండగా, దొడ్డు వడ్లకు క్వింటాలుకు రైతుల వద్ద రూ.2వేల నుంచి రూ.2,300 కొనుగోలు చేసి, క్వింటాలుకు రూ.2,600 చొప్పున ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్ అధికారులు బహిరంగ కొనుగోళ్లను ఎందుకు కట్టడి చేయడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రారంభించని కొనుగోలు కేంద్రాలు
ఖరీఫ్ వరి పంటను రైతులు కోసి ధాన్యాన్ని కల్లాలకు తరలించి ఆరబెడుతున్నారు. మండలంలో విశాల పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో 27, ఐకేపీ ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ అధికారులకు జిల్లా నుంచి ఆదేశాలు లేకపోవడంతో కేంద్రాలు ప్రారంభం కాలేదు. రైతులు పంట కోసి పది రోజులు గడిచినా కల్లాల్లోనే ధాన్యం ఆరబెడుతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం తూకం వేయాలని వాపోతున్నారు.
మిల్లుల కేటాయింపులో ఆలస్యం
ప్రభుత్వ మద్దతు ధర కంటే
తక్కువకే కొనుగోలు
కట్టడి చేయని అధికారులు
నష్టపోతున్న అన్నదాతలు
ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. బహిరంగ కొనుగోళ్లను మార్కెట్ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
– హుస్నాబాద్‌రూరల్


