వెల్దుర్తి(తూప్రాన్): వరి కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కిందపడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధి పెద్దమ్మగడ్డ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మాలావత్ శంకర్ (46) తనకున్న 30 గుంటల భూమితో పాటు కంచనపల్లి గ్రామానికి చెందిన పోచయ్య పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. మంగళవారం కౌలుకు తీసుకున్న పొలంలో హార్వెస్టర్‌తో వరి కోతలు జరుగుతుండగా, హార్వెస్టర్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో శంకర్ అదుపుతప్పి టైర్ల కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను నర్సాపూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు శంకర్‌కు భార్య భుజాలి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


