నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రభుత్వం సూచించిన నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ఆయా దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు బీపీటీ కేఎన్‌ఎం కిలోకు రూ.66, ఆర్‌ఎన్‌ఆర్‌ తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ జేఎస్‌ఆర్‌ రూ.70 కిలో చొప్పున విక్రయించాలని సూచించారు. దుకాణాదారులు నిర్ణీత ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ పౌరసరఫరాల అధికారి ఎండీ అబ్దుల్‌ నిస్సార్‌, ఇన్‌స్పెక్టర్‌ నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement