ఎల్‌నినో ప్రభావంతో వ్యాపారులు పాత బియ్యాన్ని క్వింటాలుకు రూ.12వేలకు అమ్ముతున్నరు. మరి ధాన్యం పండించిన రైతులకు బహిరంగ మార్కెట్ ధరలు ఎందుకు చెల్లించడం లేదు. రోడ్లపై దళారులు ధాన్యం కొనుగోలు చేస్తుంటే మార్కెట్ అధికారులు ఏం చేస్తున్నరు. మద్దతు ధరకు రూ.400 తగ్గించి రైతుల వద్ద కొంటున్నరు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి.
– కె. వేణుగోపాల్‌రెడ్డి,
రైతు సంఘం నాయకుడు
మండలంలో 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని దిగుమతి చేయడానికి మిల్లులు కేటాయించలే దు. కేటాయించగానే కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– ప్రవీణ్,
సీఈఓ, సహకార సంఘం, హుస్నాబాద్


