ఎంపీడీఓ బాధ్యతల నుంచి తొలగింపు
దుబ్బాకరూరల్: ఇంకుడు గుంత తవ్వుతుండగా ఉపాధి కూలీ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. గ్రామానికి చెందిన అబ్బరబోయిన పోచయ్య(61) ఉపాధి పనికి వెళ్లాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వుతున్నారు. ఈ క్రమంలో పోచయ్య తన చేతిలో ఉన్న గడ్డపారతో ఇంకుడు గుంతను తవ్వుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ప్రక్కన ఉన్న కూలీలు గమనించి స్థానిక డాక్టర్‌కు, అంబులెన్సుకు కాల్ చేశారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉన్నట్టుండి పోచయ్య ఒక్కసారిగా మృతి చెందడంతో అతని ప్రక్కనే ఉన్న భార్య లబోదిబోమంటూ గుండెలవిసేలా రోధించింది. అక్కడే ఉన్న తోటి కూలీలు కన్నీంటి పర్యంతమయ్యారు. మృతునికి కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
మెదక్ మండలంలో..
హవేళిఘణాపూర్(మెదక్): ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మద్దగుంట నర్సింలు(56) నిత్యంలాగే భార్య దుర్గమ్మతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో భార్య అతడ్ని చెట్టు కిందకు తీసుకెళ్లగానే కుప్పకూలి చనిపోయాడు. మెదక్ రూరల్ ఎస్‌ఐ సుమన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు ఉపాధి కూలీలు మృతి
నారాయణఖేడ్: నిజాంపేట ఇన్‌చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న సంగ్రాంను బాధ్యతల నుంచి తొలగిస్తూ జడ్పీ సీఈఓ జానకీరాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీబీజీరాంజీ పథకం పనుల్లో నిజాంపేట మండలం జిల్లాలోనే వెనుకబడి ఉండడంతో పాటు పనుల పర్యవేక్షణలో విఫలమైనందున సంగ్రాంను బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనను ఖేడ్ ఎంపీపీ సూపరింటెండెంట్‌గా నియమించారు. మనూరు ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ అహ్మద్ హుస్సేన్‌కు నిజాంపేట ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


