హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్ వెస్లీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీఎంశ్రీ పాఠశాలల కడ్డీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. మొదటి రోజు 17 సంవత్సరాలలోపు బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించగా 31 పీఎంశ్రీ పాఠశాలల నుంచి 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.50వేల చొప్పున క్రీడా పరికరాల కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బాలబాలికలు క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ పోటీల్లో 12 మంది సభ్యులతో కూడిన బాలుర జట్టు, 12 మందితో కూడిన బాలికల జట్టును ఎంపిక చేసిన వీరు హైదరాబాద్‌లో పోలీస్ అకాడమీలో నిర్వహించే క్రీడల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుదర్శనమూర్తి, పీటీఏటీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, ప్రతినిధులు శ్రీనివాసరావు, మధుసూదన్, పీడీలు మాధవరెడ్డి, సత్యనారాయణ, రూపేందర్, విజయ్‌కృష్ణ, సురేశ్, కిశోర్, వినోద్ పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి రాజు


