‘జలసిరి’ పనుల్లో పురోగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘జలసిరి’ పనుల్లో పురోగతి సాధించాలి

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

మెదక్‌కలెక్టరేట్‌: వీబీజీ–రామ్‌జీ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా చేపడుతున్న జలసిరి పనుల్లో పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లాలోని గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న జలసిరి పనులు, ఫారం పాండ్‌, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం, బోర్వెల్‌ రిఫ్రో సక్చర్‌, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వికసిత భారత్‌ – గ్రామీణ ఉపాధి, జీవనోపాధి మిషన్‌ హామీ పథకం‘ తదితర పథకాలపై సంబధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో జలసిరి పథకానికి ప్రాధాన్యతనిచ్చి లక్ష్యాలను ఈనెల 20 తేదీలోపు పురోగతి సాధించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టెండర్‌లో కోడ్‌ చేసిన గుత్తేదారులు నాణ్యమైన కందిపప్పు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి, పౌరసరఫరాల అధికారి నిత్యానంద్‌, మేనేజర్‌ జగదీష్‌, డీఈఓ రాజు, రవాణా శాఖ అధికారి శ్రీకాంత్‌ చక్రవర్తి , డీఆర్డిఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, సంబంధిత గుత్తేదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement