మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 వాలీబాల్ క్రీడా పోటీలకు అక్బర్పేట–భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ వి.నరేశ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఇటీవల జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో వి.సాహితి, కే.కీర్తన అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి ఎంపికై న విద్యార్థులు త్వరలో పటాన్చెరులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనర్సింహులు, టీచర్లు జీవన్, శ్యామల, మధుసూదన్ రెడ్డి, ధన్రాజ్, పద్మ, స్వామి, దుబ్బరాజయ్య అభినందించారు.


