గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

విశ్వవ్యాప్త ఆదరణ

‘మన భాష, మన మట్టి కథలకు అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయిలో గుర్తింపు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. ఈ చిన్న సినిమా.. కేవలం వినోదం కాదు, సమాజానికి అద్దం పట్టే ఆయుధం అని నిరూపించేందుకే ఈ చిత్రం తీశాను. ఈ చిత్రం కేవలం ఫెస్టివల్స్‌కు వెళ్లడం కాదు, గ్రామీణ పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని బాల బాలికల మనసుల్లోకి తొంగిచూసింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగే పిల్లలకు ఎదిగే వయసు అనేది ఒక పెద్ద సంఘర్షణగా ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆ వయసుకే కుటుంబ బాధ్యతలు మొదలవుతాయి. చదువు కొనసాగించాలా.. పొలం పనికి వెళ్లాలా.. ఆడపిల్లలైతే చదువు మాన్పించి ఇంటి పనులకు పరిమితం చేయడం. ఇదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దీంతోపాటు స్నేహంపై పరీక్ష ఉంటుంది. చిన్నప్పుడు కులం, లింగం, పేదరికం తెలియని స్నేహం, ఎదిగే వయసులో సమాజం గీసిన గీతలతో ఎలా విడిపోతుందో ఈ చిత్రం ద్వారా చూపించాం.

– బండారి సాయి స్మరణ్‌, దర్శకుడు

నారాయణఖేడ్‌: ఉపాధ్యాయురాలు దండించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖేడ్‌ పట్టణ శివారులోని మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పెద్దశంకరంపేటకు చెందిన మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులంను ఖేడ్‌ పట్టణ శివారులో నిర్వహిస్తున్నారు. ఇందులో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షిత్‌ గౌడ్‌ మొబైల్‌ ఫోన్‌ పాఠశాలకు తీసుకురావడంతో గమనించి ఓ ఉపాధ్యాయురాలు అతడ్ని దండించింది. ఫోన్‌ లాక్కొని పాఠశాలలో డిపాజిట్‌ చేసింది. విషయం కుటుంబీకులకు చెబుతానని హెచ్చరించడంతో ఆందోళనకు గురైన విద్యార్థి శుక్రవారం సాయంత్రం మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ తాగి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు సమాచారం అందించంతో హుటాహుటిన ఖేడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్సీఓ రాజేశం గురుకులాన్ని సందర్శించి విద్యార్థి పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌ ప్రతిభ మాట్లాడుతూ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయురాలు మందలించిన విషయం తెలియదన్నారు. ఈ ఘటనపై సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి రమేశ్‌, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్‌, అశోక్‌గౌడ్‌, మోహన్‌, శ్రీనివాస్‌ తదితరులు విద్యార్థినిని పరామర్శించారు. గురుకులాల్లో పేరెంట్స్‌ సమావేశాలు నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఆస్పత్రికి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement