చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పి.నర్సింహ్మాచారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్–17 పీఎంశ్రీ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలకు జట్లు ఎంపికయ్యాయని తెలిపారు. అలాగే దృశ్యంత్ 200 మీటర్స్ పరుగు పందెంకి ఎంపికయ్యాడు. ఎంపికై న విద్యార్థులను శనివారం కళాశాలలో అభినందించారు.


