అనుమానాస్పదంగా బకెట్‌లో పడి పాప మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా బకెట్‌లో పడి పాప మృతి

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

● ఇది హత్యేనంటున్న బంధువులు

● ఇరువర్గాల మధ్య ఘర్షణ

రామాయంపేట(మెదక్‌): మూడున్నరేళ్ల పాప నీటి బకెట్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఆర్‌ వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన సాయిలోల్ల సాగర్‌, చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన హేమలతకు నాలుగేళ్లక్రితం వివాహమైంది. వారికి మూడేన్నర ఏళ్ల కూతురు మహిమాన్విత ఉంది. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, పలుమార్లు పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కారు. కాగా శనివారం ఉదయం పాప నీటి బకెట్‌లో పడి మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకొని రెండు గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌వద్దకు తరలివచ్చారు. ప్రమాదవశాత్తు బకెట్‌లో ఉన్న నీటిలో పడి మహిమాన్విత మృతి చెందినట్లు తండ్రి తరపువారు చెపుతుండగా, పథకం ప్రకారం ఆమెను హతమార్చి బకెట్‌లో పడి మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని హేమలత పుట్టింటివారు ఆరోపించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటా మాట పెరిగి జరిగిన ఘర్షణలో ముగ్గురు స్పల్పంగా గాయపడ్డారు. కాగా చిన్న బకెట్టులో సగభాగం మాత్రమే ఉన్న నీటిలో పాప పడితే ఎలా మృతి చెందుతుందని పులిమామిడి గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాత్రి ఏడు గంటలవరకు తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాల్‌రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement