నారాయణఖేడ్: బంగారు ఆభరణాలు ఉన్న పర్సును అప్పగించి యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. న్యాల్‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన పార్వతి ఆదివారం షాపింగ్ కోసం ఖేడ్‌కు వచ్చింది. స్థానిక బంగారు నగల మార్కెట్ వద్ద రెండున్నర తులాల బంగారు ఆభరణాలు ఉన్న పర్సు పడిపోయింది. ఆలస్యంగా గుర్తించి వెతకగా లభించలేదు. ఆ పర్సు షాపింగ్ కోసం ఖేడ్‌కు వచ్చిన మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు నవీన్‌కు దొరికింది. ఆ ప్రాంతంలో ఆరా తీయగా పార్వతి పోగొట్టుకుని వెతుకుతున్నట్లు గుర్తించి పర్సు తనకు దొరికిందని చెప్పాడు. స్థానిక పెద్దల సమక్షంలో ఆ పర్సులో ఏయే ఆభరణాలు, ఏమేం ఉన్నాయో పార్వతి ద్వారా తెలుసుకుని పర్సు ఆమెదేనని నిర్ధారించుకుని అప్పగించారు. తన బంగారు ఆభరణాలు తనకు తిరిగి లభించడంతో పార్వతి సంతోషం వ్యక్తం చేస్తూ నవీన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. దొరికిన ఆభరణాలను నిజాయితీతో అప్పగించినందుకు స్థానికులు అతడ్ని ప్రశంసించారు.


