● మంత్రి పొన్నం ప్రభాకర్ ● విద్యుత్ దీపాలు ప్రారంభం
వాగుల్లో నీరు లేక..
కాల్వలోనే నిమజ్జనం
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని కూచనపెల్లిలో మర్రివాగు పారకపోవడంతో బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు చుక్కనీరు లేదు. దీంతో ఆదివారం చెరువు కాల్వల్లో మోటారుతో నీరు నింపారు. అనంతరం మహిళలు ఆటపాటలు ఆడిన తరువాత బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఊరూరా చెరువుల దగ్గర బతుకమ్మ ఘాట్లను నిర్మించి నీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్‌రూరల్: బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం తోటపల్లి, గాంధీనగర్ గ్రామాల నుంచి చెరువు వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను మంత్రి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొని మహిళలతో మాట్లాడారు. కాగా సద్దుల బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి ఆడిపా డారు. తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సంపత్, లక్ష్మి, నాయకులు శివయ్య, వెంకట్, లింగమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.
చాలా గొప్ప సంస్కృతి
స్విట్జర్లాండ్ మహిళ నథాలి
దుబ్బాక: పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబరాల్లో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన మహిళ నతాలి సందడి చేశారు. పట్టణానికి చెందిన మహిళ స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. ఆమె స్నేహితురాలు స్విట్జర్లాండ్‌కు చెందిన నథాలిని పండుగకు తీసుకొచ్చారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు ఆమెతో బతుకమ్మలను పట్టుకొని ఫొటోలు,సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నతాలి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సంస్కృతి చాలా గొప్పదన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఇలా ఓ చోట పెట్టి ఆడటం చాలా బాగుందన్నారు. ఇలాంటి గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. బతుకమ్మ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
దుబ్బాకలో ఎల్‌నినో బతుకమ్మ
వినూత్నంగా అవగాహన
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎల్‌నినో బతుకమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. పట్టణానికి చెందిన మచ్చ రజిత, తన కూతురు సుహానీ బతుకమ్మలకు ప్రత్యేకంగా ఎల్‌నినో ఎఫెక్ట్ చిత్రాలతో పాటు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుందాం.. నీళ్లను పొదుపుగా వాడుకుందాం అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను బతుకమ్మలపై పెట్టారు. ఈ ఎల్‌నినో బతుకమ్మలను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించాలనే మంచి సంకల్పంతోనే బతుకమ్మలను ఇలా వినూత్నంగా పేర్చామని ఈ సందర్భంగా రజిత ‘సాక్షి’కి తెలిపారు.


