కౌడిపల్లి(నర్సాపూర్): థాంగ్–తా మార్షల్ ఆర్ట్స్‌లో మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రౌతు గణేశ్ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల పీడీ, కోచ్ పూర్ణచందర్ ఆదివారం తెలిపారు. ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో అండర్–14 బాలుర విభాగంలో 8వ తరగతి విద్యార్థి రౌతు గణేశ్ బంగారు పతకం గెలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. అలాగే 8వ తరగతికి చెందిన అజయ్, సృజన్, అండర్–17లో, 10వ తరగతికి చెందిన రంజిత్ వెండి పతకాలు సాధించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రౌతు గణేశ్ పాల్గొంటాడని పీడీ తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం సరోజ, సర్పంచ్ శివలీల, ఉపసర్పంచ్ ప్రభు, నాయకులు, గ్రామస్తులు అభినందించారు.


