అన్నదమ్ములకు ఒకేసారి పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములకు ఒకేసారి పదోన్నతులు

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

నారాయణఖేడ్‌: మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన తొర్రి జానయ్య, తొర్రి పోచయ్య అన్నదమ్ములు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వీరు పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో కష్టపడి చదివి 25 ఏళ్ల కింద కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ పోలీసు ఠాణాల్లో పనిచేశారు. పదేళ్ల కింద ఏఎస్సైలుగా పదోన్నతిని పొంది వివిధ పోలీసు ఠాణాల్లో విధులు నిర్వర్తించి తాజాగా ఇద్దరూ ఎస్సైలుగా పదోన్నతి పొందారు. పోచయ్య పంజాగుట్ట ఎస్సైగా, జానయ్య హైదరాబాదులో ఇంటిలిజెన్స్‌ ఎస్సైగా విధుల్లో చేరారు. ఒకేసారి పదోన్నతులు రావడంతో కుటుంబీకులతో పాటు సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.

చెరువులో వృద్ధురాలి మృతదేహం

సంగారెడ్డి టౌన్‌: వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఎస్సై మధుసూధన్‌ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని కల్పగూరు( అంగడిపేట్‌) గ్రామానికి చెందిన పెద్దగొర్లు పోచమ్మ (60) ఆదివారం చెరువులో శవమై కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement