మానవసేవే.. మాధవసేవ | - | Sakshi
Sakshi News home page

మానవసేవే.. మాధవసేవ

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ

వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ

వెల్దుర్తి(తూప్రాన్‌): ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, వృద్ధాప్యంలో దిక్కులేని వారికి తోడుగా నిలిచి వారి ఆకలి తీర్చడం గొప్ప మానవతా సేవ. ఇలాంటి సేవాభావంతో మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన డీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యంలో వంట చేసుకునే శక్తి లేక, ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 30 మంది వృద్ధులకు మూడేళ్లుగా నిత్యం అన్నదానం చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. సేవ చేయడంలోనే నిజమైన మానవ సేవ ఉందని నిరూపిస్తున్న నరేందర్‌ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement