గురువులపై విశ్వాసం కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గురువులపై విశ్వాసం కలిగి ఉండాలి

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

రాయికోడ్‌(అందోల్‌): భగవంతుడు, గురువులపై విశ్వాసం కలిగి ఉండాలని మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు తెలిపారు. రాయికోడ్‌లోని ముమ్మాదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధ్యక్షుడు గుడ్ల లక్ష్మణ్‌, గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ధర్మ సందేశం చేశారు. ప్రతి ఒక్కరూ దురలవాట్లను మాని ఆధ్యాత్మికత వైపు మనస్సును మల్లించాలన్నారు. ప్రతి వ్యక్తిలో, ప్రకృతిలో దైవత్వం దాగి ఉందన్నారు. కళ్లకు కనిపించని భగవంతుడి కృప, దయ, దీవెనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పురోహితులు సకారం జ్యోషి, నాయకులు విఠల్‌, భక్తులు పాల్గొన్నారు.

గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 10, 11 తేదీల్లో రెండో అంతర్జాతీయ వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజ సదస్సు (బీఐఎస్‌ఎస్‌–2026) నిర్వహించనున్నారు. ‘మానవ–యంత్ర అనుసంధానంతో వ్యాపార శ్రేష్ఠత’ ఇతివృత్తంగా జరిగే ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొననున్నారు. కృత్రిమ మేధస్సుతో వ్యాపారాభివృద్ధి, ఉత్పాదకత, సుస్థిరత, సమ్మిళిత అభివృద్ధి సాధనపై చర్చించనున్నారు. పరిశోధనా పత్రాల సమర్పణ, పోస్టర్‌ ప్రదర్శన, ప్యానెల్‌ చర్చలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ప్రత్యేక వేదిక కల్పించనున్నారు. వివరాలకు డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ (88266 99667), డాక్టర్‌ ఆర్‌. వీరబాబు (99665 78892)లను సంప్రదించాలని కోరారు.

ప్రాణాలు తీసిన

అనారోగ్య సమస్యలు

ఏడేళ్లలో కుటుంబ సభ్యులందరూ

మృత్యువాత.. తాజాగా యువకుడు

శివ్వంపేట(నర్సాపూర్‌): అనారోగ్య సమస్యలతో ఏడేళ్ల కాలంలో కుటుంబ సభ్యులంతా మృత్యువాత పడడం మండల పరిధిలోని అల్లీపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెల్లేర ప్రభాకర్‌(19) కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందాడు. ఏడేళ్ల కిత్రం అతని తల్లి సాలమ్మ, నాలుగేళ్ల క్రితం తండ్రి నర్సింలు, రెండేళ్ల క్రితం అన్న బాల్‌రాజ్‌ మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా మృత్యువాత పడటంతో సర్పంచ్‌ కుమార్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఆలయంలో చోరీ

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని లింగాపూర్‌ బీరప్ప ఆలయంలో శనివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ ఆసీఫ్‌ కథనం ప్రకారం.. ఆలయంలో అమ్మవారి నాలుగు గ్రాముల బంగారు ముక్కు పుడక, బొట్టు బిళ్లలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే హుండీలో ఉన్న సుమారు రూ.5వేల నగదును సైతం అపహరించారు. గ్రామానికి చెందిన బక్కయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

పెద్దశంకరంపేట(మెదక్‌): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దశంకరంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఔదగిరి బేతయ్య(38) చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా గురువారం సాయంత్రం ఇంటి నుంచి చేపలు పట్టేందుకు కుంటవద్దకు వెళ్లి తిరిగిరాలేదు. స్థానికుల సమాచారం మేరకు గ్రామశివారులోని దయ్యాల మారకుంటలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా నీటిలో బేతయ్య మృతదేహం లభ్యమైంది. కాగా మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వాగులో పడి యువకుడి గల్లంతు

దుబ్బాకరూరల్‌: వాగులోపడి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన అక్బర్‌పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామం ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణానికి చెందిన పర్స కార్తిక్‌(29) తన స్నేహితులతో కలిసి కూడవెల్లి వాగు వద్దకు వెళ్లి నీటిలోకి ది గి గల్లంతయ్యాడు. వాగు వద్దకు స్నానానికి వెళ్లిన గ్రామస్తులు ఆరా తీయగా తమ స్నేహితుడు వాగులోకి వెళ్లి బయటకు రాలేదని చెప్పారు. వాగు గట్టుపై బట్టలు, ఆధార్‌కార్డును పోలీసులు గుర్తించారు. చీకటి కావడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. సోమవారం మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement