ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
జిన్నారం (పటాన్‌చెరు): ప్రజా భద్రత దృష్ట్యా పోలీస్‌శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. నగర శివారు ప్రాంతమైన సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంను నూతన పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంగా మార్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంగా ఉన్న జిన్నారం సబ్ డివిజన్‌గా మారింది. కాగా, డివిజన్ పరిధిలో నాలుగు సర్కిళ్లు జిన్నారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, బీడీఎల్ బానూర్‌లతో డివిజన్‌గా మారింది. హత్నూర స్టేషన్‌ను కలుపుతూ గుమ్మడిదలో నూతన సర్కిల్ ఏర్పాటైంది. బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి, గూడెం, గొల్లగూడెం, గడ్డపోతారం, చెట్లపోతారం, అలీనగర్, కిష్టయ్యపల్లి, దాచారం, మాదారం, దువ్వగుంట, కొర్లకుంట గ్రామాలు జిన్నారం స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. శనివారం నుంచి మారిన పోలీస్ సేవలు, ఫిర్యాదుల కోసం ఆయా స్టేషన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


